telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఈ నెల 20న ముంబై వెళ్ళ‌నున్న కేసీఆర్‌

*ఈ నెల 20న ముంబై వెళ్ళ‌నున్న కేసీఆర్‌
*కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించిన ఉద్ధ‌వ్ థాక్రే
*బీజేపీపై కేసీఆర్ పోరాటానికి ఉద్ధ‌వ్ థాక్రే మ‌ద్ద‌తు..

ఈ నెల 20న ముంబయికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ను కేసీఆర్ కలవనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి వివిధ రాష్ట్రాల సీఎంలు వ్యూహరచన చేస్తున్నారు. దేశ రాజీకాయాల్లో మార్పు రావాల్సి అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు పెరుగుతోంది.

అందులోమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే… సీఎం కేసీఆర్​కు ఫోన్‌చేసి ముంబయికి అహ్వానించారు. ముంబైకి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ… ” కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు.మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి.మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది.ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…” అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఇప్పటికే మమత బెనర్జీతో ఫోన్ లో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడ సైతం కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. మమత బెనర్జీ ఆహ్వానం మేరకు కేసీఆర్ కోల్ కత్తా వెళ్లనున్నారు. ఈ లోపు ఈ నెల 20 వతేదీ ముంబయికి వెళ్లి జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ థాక్రేతో చర్చించనున్నారు.

Related posts