telugu navyamedia
తెలంగాణ వార్తలు

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా త‌గ్గేదేలే..- కేసీఆర్‌

డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ఇవాళ డీజీపీ, ముగ్గురు కమిషనర్లతో సీఎం కేసీఆర్ సమీక్షనిర్వహించారు.

డ్రగ్స్ వాడకాన్ని నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టేందుకు ఈనెల 28 వ తేదీ శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరపాలని సీఎం నిర్ణయించారు.సీఎం కేసిఆర్ అద్యక్షతన జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం వెయ్యి మందితో కూడిన ప్రత్యేక ‘‘నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ” పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో పనిచేయనుంది.

డ్రగ్స్ సంబంధిత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా విధులను నిర్వర్తించనుంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన కఠిన చర్యలపై ప్రగతి భవన్ లో సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.

Related posts