telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కొనసాగనున్న లాక్ డౌన్ ..?

Red zone corona

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌ను కొంతమేర సడలిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణలో లాక్‌డౌన్‌ను సడలించాలా లేక ఎప్పటిలానే కొనసాగించాలా అనే అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పుడ్‌ డెలివరీ సర్వీసులను కూడా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, కరోనా వైరస్‌ నియంత్రణ వంటి అంశాలపై కేబినెట్‌ చర్చిస్తోంది.

Related posts