*వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
*టీఆర్ ఎస్ జిల్లా ఆఫీస్ ప్రారంభోత్సవం
*సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
*వికారాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగసభ
వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు . మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. .
తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం డజన్ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి.
మోదీ సంస్కరణల వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్: లక్ష్మణ్