telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని మూసివేస్తామంటే ఊరుకునేది లేదు: షబ్బీర్ అలీ

shabbir ali congress

ఆర్టీసీని మూసివేస్తామంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈరోజు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదని.. దాన్ని ఎట్లా మూసివేస్తారని ప్రశ్నించారు. నష్టాల్లో చవిచూస్తున్న ఆర్టీసీపై ముందే సమీక్ష ఎందుకు చేయలేదన్నారు. ఐదేళ్లలో సమీక్షలు చేయని మీరు ఇప్పుడు మూసివేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.

గతంలో తాను రవాణాశాఖ మంత్రిగా పని చేశానని చెబుతున్న కేసీఆర్.. విషయాలన్నీ తెలుసు అంటూ ఎవరిని ప్రశ్నించనీయరా? అని నిలదీశారు. ఆర్టీసీకి ఇన్నినష్టాలు వచ్చేంత వరకు చూశారు. ఐదేళ్లు సీఎంగా పనిచేస్తున్నారు. దీనిపై మీరు ఒక్కసారికూడా సమీక్ష జరపలేదెందుకని నిలదీశారు. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని అడిగారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిసినప్పటికి డీజిల్ పై విధిస్తున్న పన్నులో రాష్ట్ర వాటాను తగ్గించి ఆర్టీసీనీ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు.

Related posts