బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ పండుగ కోసం దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని రకాల ఏర్పాటు చేయాలి అని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.