telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణలో అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను సీఎం కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచ‌న‌..

మొత్తం 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించగా.. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లు, మాజీ ఎంపీపీ, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్‌కు సైతం పార్టీ జిల్లా అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ముగ్గురు జిల్లా పరిషత్ ఛైర్మెన్లకు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు కేసీఆర్.

ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న నియమితులవగా, కుమ్రం భీం జిల్లాకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంచిర్యాల జిల్లాకు బాల్క సుమన్‌, నిర్మల్‌ జిల్లాకు జీ. విఠల్‌ రెడ్డి.. పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు.

టీఆర్ఎస్ పార్టీ కొత్త జిల్లాల అధ్యక్షులు వీరే

1 కొమరంభీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప
2.మంచిర్యాల – బాల్క సుమన్
3.ఆదిలాబాద్- జోగు రామన్న
4.నిర్మల్- విఠల్ రెడ్డి
5. నిజామాబాద్ – జీవన్ రెడ్డి
6.కామారెడ్డి-ముజీబుద్దీన్
7.కరీంనగర్- రామకృష్ణారావు
8.రాజన్న సిరిసిల్ల- తోట ఆగయ్య
9.ఖమ్మం – తాతా మధుసూదన్ రావు
10.భూపాలపల్లి- గండ్ర జ్యోతి
11.భద్రాద్రి కొత్తగూడెం- రేగా కాంతారావు
12. నల్గొండ- రవీంద్ర నాయక్
13.సూర్యాపేట- బడుగుల లింగయ్య యాదవ్
14.యాదాద్రిభువనగరి- కంచర్ల రామకృష్ణారెడ్డి
15.రంగారెడ్డి- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
16.వికారాబాద్ – మెతుకు ఆనంద్
17.మేడ్చల్- శంభీపూర్ రాజు
18.మహబూబ్ నగర్ – లక్ష్మారెడ్డి
19.మహబూబాబాద్- మాలోతు కవిత
20. ములుగు- కుసుమ జగదీష్
21.నాగర్ కర్నూల్-గువ్వల బాలరాజు
22.గద్వాల- బండ కృష్ణమోహన్ రెడ్డి
23.నారాయణపేట- రాజేందర్ రెడ్డి
24.వనపర్తి- గట్టు యాదవ్
25.హైద్రాబాద్- మాగంటి గోపి
26. హన్మకొండ- వినయ్ భాస్కర్
27. జనగామ- సంపత్ రెడ్డి
28.వరంగల్ – ఆరూరి రమేష్
29.సిద్దిపేట- కొత్త ప్రభాకర్ రెడ్డి
30.సంగారెడ్డి- చింతా ప్రభాకర్
31.మెదక్- ఎం. పద్మా దేవేందర్ రెడ్డి
32.జగిత్యాల- కె. విద్యాసాగర్ రావు
33. పెద్దపల్లి- కోరుకంటి చందర్

Related posts