telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం జగన్‌

*2022-23 సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన జగన్

*ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు

రాష్ట్రంలో కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ప్రజలకు అందే పథకాలపై సీఎం జగన్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. 

మూడేళ్లలో పాలనలో 95 శాతం హామీలు నెరవేర్చామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని అన్నారు.

కరోనా వచ్చి ఆదాయం తగ్గినా తమ దీక్ష మారలేదని.. అందరూ మన వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతోందన్నారు. ఈ ఏడాది రూ. 2.56 లక్షల కోట్లతో ప్రజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామన సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సంక్షేమ క్యాలెండర్ విడుదల..పూర్తి వివరాలివే

* ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు

* మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా

* జూన్‌లో అమ్మ ఒడి పథకం

* జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు.

* ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం.

* సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత

*అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా

* నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు

* డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు

*జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు

* ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు

* మార్చిలో వసతి దీవెన అమలు

Related posts