telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు: అచ్చెన్నకి సీఎం జగన్‌ ఆఫర్‌..

*బీఏసీ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..
*టీడీపీ ఏం అడిగితే ఆ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్న సీఎం జ‌గ‌న్‌
*మీరు ఒక మాట అంటే మావాళ్ళు ప‌ది మాట‌లు అన‌గ‌ల‌ర‌న్న సీఎం
మీరు 17మంది..మేము 150 ఉన్నాం..
*మీ నాయ‌కుడిని కూడా స‌భ‌కు ర‌మ్మానండి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుగురువారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి జగన్ , టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య కీలకమైన చర్చ జరిగినట్లుగా సమాచారం. 

ప్రజా సభస్యలను చర్చించాల్సిన సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం ఏంటని అచ్చెన్నాయుడు తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

మనం మనం రాజకీయ నాయకులం ఎన్నైనా అనుకుంటాం.. కానీ కుటుంబసభ్యులను ఈ రాజకీయ విమర్శల్లోకి లాగడం ఎందుకని జగన్ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు.కుటుంబ సభ్యుల జోలికి రావాలనుకోం.కుటుంబ సభ్యుల జోలికి మీరొస్తే మా ముఖ్యమంత్రిని అంటారా అని మావాళ్లూ అంటారు. 

‘మీరు ఏమీ అనకుంటే మా వాళ్లు అనరు. మీరంటే మాత్రం మావాళ్లూ అంటారు’ అన్నట్టుగా మాట్లాడారు.మీరు మానేస్తే మావాళ్లూ ఆటోమెటిక్‌గా మానేస్తారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది మాటలంటారు’ అంటూ అచ్చెన్నకు హితబోధ చేశారు. 

మీరు 17 మంది ఉన్నారు. మేం 150 మందికిపైగా ఉన్నాం, మీరురెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మా వాళ్లు కచ్చితంగా దే చేస్తారని చెప్పారు జగన్ చెప్పారు.

టీడీపీ  ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. మీరు ఏ అంశం కోరితే ఆ అంశంపై చర్చిద్దామని సీఎం జగన్ అచ్చెన్నాయుడు కు చెప్పారు. అవసరమైతే ఈఎస్ఐ స్కాం పైనే చర్చకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

రాజధాని అంశంపై చర్చ కావాలంటే దానిపై కూడా తాము సిద్దంగా ఉన్నామని కూడా జగన్ స్పష్టం చేశారు. మీ నాయకుడిని సభకు రమ్మనండి దేనికైనా రెడీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్.

.సభ సజావుగా జరిగేలా ప్రతిపక్ష సభ్యులు సహకరించాలి, సభకు వచ్చి గౌరవంగా ఉండాలని సీఏం జగన్మోహన్ రెడ్డి టీడీపీ సభ్యులకు సూచించారు.

అదే సమయంలో బీఎసీ సమావేశంలో ఉన్న మంత్రులు జోగి రమేష్ , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా తమ సీఎంను అంటే ఊరుకునేది లేదని అన్నట్లగా తెలుస్తోంది. ‘మీ ప్రశ్నలూ మేం లేవనెత్తబోయేవీ దాదాపు ఒక్కటే అన్నీ చర్చిద్దాం’ అని అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Related posts