telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

థ‌ర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉన్నాం : సీఎం జగన్

cm jagan

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా థ‌ర్డ్ వేవ్‌పై హెచ్చ‌రిక‌లు భారీగా వస్తున్నాయి. దాంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్తం అవుతోంది.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది స‌ర్కార్.. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అల‌ర్ట్ అయిన స‌ర్కార్.. పిడీయాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఏర్పాటైంది.. మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్‌ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయ‌నుంది టాస్క్‌ఫోర్స్‌. చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక కూడా ఇవ్వ‌నుంది.. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Related posts