ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాలలో పర్యటించనున్నారు.
ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారయింది. చంద్రబాబు పర్యటన వివరాలను సీఎంఓ విడుదల చేసింది.
ఈరోజు కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ లో బయలుదేరి బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళతారు.
అక్కడి నుండి రోడ్డు మార్గంలో చీరాల జంద్రాపేటలో గల బీవి అండ్ బీఎన్ హైస్కూల్ ఆవరణకు మధ్యహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొననున్నారు.
చేనేత కార్మికుల గృహాలకు వెళతారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు.
స్థానిక చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశం అవుతారు. తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి ఆరు గంటలకు హెలికాఫ్టర్ లో ఉండవల్లికి చేరుకుంటారు.
కాగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ నిన్న సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.