telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం చంద్రబాబు రాత్రి 2 గంటల వరకూ కలెక్టరేట్లో వరద సహాయక చర్యలపై పర్యవేక్షణ

సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

స్వయంగా ఆయనే రంగంలోకి దిగి బాధితులను పరామర్శించడం, వారి సమస్యలను అడిగి తెలుసుకుని కావాల్సిన సాయం అందించడం చేస్తున్న విషయం తెలిసిందే.

దీనిలో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం రాత్రి 2 గంటల వరకూ విజయవాడ కలెక్టరేట్  లోనే ఉన్నారు.

మూడో రోజు సహాయక చర్యలు, వరద నిర్వహణను పర్యవేక్షించిన చంద్రబాబు. కలెక్టరేట్ వద్ద బస్సులోనే బస చేయడం గమనార్హం.

రెండు గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ఆయన వెళ్లారు. నేడు విజయవాడకు అదనపు సహాయక బృందాలు రానున్నాయి.

Related posts