ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పంటించారని వస్తోన్న వార్తలన్నీ అసత్యాలేనని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు.ఢిల్లీలో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు.
కాగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లలో బాధిత కుటుంబానికి వెంటనే రూ.25,000 అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 167 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే, 885 మంది అనుమానితులను అరెస్ట్ చేశామని చెప్పారు. కొన్ని కేసులను సాయుధ బలగాల చట్టం కింద నమోదు చేసినట్లు వివరించారు.