telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

పదో తరగతి చదువుతున్న ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు తెలుగు మాధ్యంలో పరీక్షలు రాసుకోవచ్చు: ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది.

ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది.

2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది.

సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ‘కావడంతో ‘ఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ‘ఒకే మాధ్యమం’ ఉండాలని ఆదేశించింది.

ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు.

ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Related posts