telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

జూన్ 2న .. ఏపీలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ..

civils priliminary on june 2nd

జూన్‌ 2న (ఆదివారం) సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరి) పరీక్ష జరగనుంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ పరీక్షకు పరిశీలకులుగా ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది.

అనంతపురం సెంటర్‌కు బాబు(ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ), తిరుపతి సెంటర్‌కు శశిభూషణ్‌ కుమార్‌ (రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి), విజయవాడ సెంటర్‌కు సాధారణ పరిపాలనశాఖ రాజకీయ కార్యదర్శి డాక్టర్‌ నాగులపల్లి శ్రీకాంత్‌, జీఏడీ సేవలు-హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శి డాక్టర్‌ పి.లక్ష్మీనరసింహం, విశాఖపట్నం సెంటర్‌కు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ కాంతిలాల్‌ దండే, పరిశ్రమలు-వాణిజ్య విభాగ కార్యదర్శి సొలోమన్‌ ఆరోకియా రాజ్‌లను పరిశీలకులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

Related posts