telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : మెగా మనవరాలిని చూశారా ?

Kalyan-Dev

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజకు నాలుగు నెలల క్రితం కూతురు జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఇంటనే కాదు సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ చిరంజీవి మనువరాలు ఫోటోలతో తెగ సందడి చేస్తోంది. ఆమెకు “నవిష్క” అని నామకరణం చేశారు. అయితే ఆమెకు నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ మొదటిసారి తన కూతురు ఫొటోలను మెగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయంపై నీ వల్లనే నమ్మకం కలిగింది. ఎందుకంటే నువ్వు పుట్టిన క్షణం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా నవిష్క’’ అంటూ పోస్ట్ చేశాడు కళ్యాణ్ దేవ్. ఎంతో అందంగా ముద్దు ముద్దుగా ఉన్న మెగా మనువరాలిని చూసి మెగా అభిమానులు కూడా ముచ్చటపడుతున్నారు.

Related posts