telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ వేదికపై …సందడి చేసిన చిరంజీవి..

chiranjeevi in bigg boss 3 telugu finals

మెగాస్టార్ చిరంజీవి తెలుగు బిగ్ బాస్ 3 ఫైనల్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హోస్ట్ నాగార్జునతో కలిసి విపరీతంగా సందడి చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తనదైన శైలిలో హాస్యం పండించారు. అయితే ట్రాన్స్ జెండర్ తమన్నాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు అని చిరంజీవి అంటుండగానే తమన్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అసలు చిరు దేనిగురించి మాట్లాడుతున్నాడో అక్కడెవరికీ అర్థంకాలేదు. అయితే చిరంజీవి మళ్లీ అందుకుని, ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ.. అంటూ అభినందించే సరికి తమన్నా తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.

Related posts