చిత్రపరిశ్రమలో పెళ్ళి, ప్రేమ, విడాకులు ఫ్యాషన్ అయిపోయింది..,కోలీవుడ్, బాలీవుడ్ మరియు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇటీవల నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న కోలీవుడ్‌లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా టాలీవుడ్‌లో మరో జంట విడిపోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. ఇక సంక్రాంతికి విడుదలైన కళ్యాణ్ దేవ్ సినిమా సూపర్ మచ్చి కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. దీంతో ఈ జంట ఎప్పుడో విడిపోయినట్లు తెలుస్తోంది.
తాజాగా శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ ని చేంజ్ చేసింది. అంతకు ముందు భర్తపేరును కలిపి శ్రీజ కళ్యాణ్ పేరును పెట్టిన శ్రీజ, కళ్యాణ్ పేరును తొలగించి తండ్రి ఇంటి పేరు కొణిదెల యాడ్ చేసి శ్రీజ కొణిదెల గా మార్చింది. దీంతో వీరి విడాకులు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
శ్రీజకు కళ్యాణ్ దేవ్ రెండవ భర్త.. 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ అతనితో 2014లో విడాకులు తీసుకొని విడిపోయింది. ఆ తరువాత 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది.