telugu navyamedia
సినిమా వార్తలు

క‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌, బెడ్‌పైనే కేక్ క‌ట్ చేయించిన చిరు..

సీనియర్‌ నటుడు సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు. సోమవారం(జూలై 25న) ఆయన 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా కైకాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను మెగాస్టార్ చిరంజీవి నిర్వహించారు . స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్‌ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Image

పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున, వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Image

కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు.

ఈ పుట్టినరోజు వేడుకలోకైకాల సత్యనారాయణ కుమారులు కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు (చిన్నబాబు), కైకాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts