telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతిరోజూ పండగే : “చిన్నతనమే చేర రమ్మంటే…” లిరికల్ వీడియో సాంగ్

PP

తాతగా సత్యరాజ్, మనవుడిగా సాయితేజ్ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రంలోని ‘‘చిన్నతనమే చేర రమ్మంటే.. ప్రాణం నిన్న వైపే దారి తీస్తోందే..’’ అనే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేశారు. ఈ సాంగ్‌కు సిరివెన్నెల సాహిత్యం రచించగా విజయ్ ఏసు‌దాస్ ఆలపించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. పల్లెటూరి నేపథ్యంలో దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్షర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts