telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనా లెక్కలు నమ్మశక్యంగా లేవు.. ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలీ

Nikki Heli

కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే మరణించారన్న చైనా ప్రకటన ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆరోపించారు.చైనా చెబుతున్న లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు. కరోనా మరణాల విషయంలో చైనా చెబుతున్న లెక్కలను నమ్మొద్దంటూ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి చైనాలో 42 వేల మందికిపైగానే మరణించి ఉంటారన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

కరోనా బారినపడి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. యూరప్‌లో రోజూ వేలాదిమంది ప్రాణాలు వదులుతున్నారు. చైనాలో కరోనా కేసులు బయటపడిన రెండు నెలలకు అమెరికాకు పాకిన ఈ వైరస్ అక్కడ ఇప్పటికే 5800 మందిని బలితీసుకుంది. 2.4 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తమ దేశంలో మరణించిన వారి సంఖ్యను తక్కువ చేసి చెబుతోందన్న ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts