telugu navyamedia
వార్తలు

వైరల్ : విమానంలో గుర్రు పెట్టి నిద్రిస్తున్న పైలెట్

China Airline Pilot Fall Asleep in Cockpit

విమానాన్ని నడుపుతున్న పైలెట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంచం ఏమరపాటుగా ఉన్నా, ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా వందలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అందుకే పైలెట్లుగా ఎప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉంటారు. అయితే తాజాగా ఓ పైలెట్ కాక్ పిట్ లో నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 747 విమానం 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. విమానం అలా గాల్లో ఉండగానే సీనియర్ పైలట్ ఒకరు గుర్రుపెట్టి నిద్రపోయారు. కాక్‌పిట్‌లో ఈయన కునుకు తీస్తోన్న సమయంలో తోటి పైలెట్ వీడియో తీశాడు. కానీ ఇతనిని నిద్రలేపే ప్రయత్నం చేయలేదు. సదరు  పైలెట్ ని తైవాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలెట్ వెంగ్ జియాఘిగా గుర్తించారు. ఈ ప్రయాణంలో ప్రమాదమేమీ జరగకపోయినా కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుండడంతో ఆ పైలట్‌తో సహా మరొక వ్యక్తిని అధికారులు విధుల నుంచి తప్పించారు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts