telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

10 నెలల తర్వాత నిజాన్ని ఒప్పుకున్న చైనా…

india-china-meating

మన దేశంలో 10 నెలల కిందట జరిగిన విషయాన్ని ఎవరు మర్చిపోలేరు. ఇండియా చైనా బోర్డర్ లోని గాల్వాన్ లోయలో గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  గతేడాది జూన్ 15 వ తేదీన గాల్వాన్ లోయలో చైనా సైనికులు ఇండియా బోర్డర్ దాటి లోనికి వచ్చెనందుకు ప్రయత్నం చేయడమే కాకుండా, పదునైన ఆయుధాలతో భారత సైనికులపై దాడి చేశారు.  అయితే, ఈ దాడిని భారత సైనికులు సమర్ధవంతంగా ఎదుర్కొని చైనా సైన్యాన్ని తిప్పికొట్టారు.  ఈ ఘటనలో భారత సైనికులతో పాటుగా చైనా సైనికులుడ భారీగా మృతి చెందారు.  కానీ, ఈ వాస్తవాలను చైనా దాచిపెడుతూ వస్తున్నది.  తాజాగా, చైనా అధికారిక పత్రిక పీఎల్ఏ డైలీ దీనికి సంబంధించిన న్యూస్ ను ప్రచురించింది.  గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలో ఐదుగురు అధికారులు, పలువురు సైనికులు ఉన్నట్టు పీఎల్ఏ డైలీ పేర్కొన్నది.  గాల్వాన్ ఘటనలో పలువురు చైనా సైనికులు మరణించారని భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలు పేర్కొన్నా, చైనా మాత్రం నోరు మెదపలేదు.  ఇన్నాళ్ల తరువాత ఈ విషయాన్ని చైనా బయటపెట్టడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts