జామచెట్టుపై
అందమైన
చిలుకొకటుంటోందీ
గోరింకగా
నేమారీ వాలగా
ఎగిరెగిరిపోతోందీ
రాత్రి పగలు
తన ఊహలే
మేఘాలై ముసిరాయి
తన ప్రేమగా
అవి మారి వర్షించీ
నను తడిపేసి వెళ్లాలీ…
తానూ నేనూ
కలిసెళ్లీ
చందమామపై
వాలాలీ
తన ప్రేమ
వెన్నెలగా మారి కురిసి
నను ముంచెత్తి వెళ్ళాలీ…..
రచన: మాణిక్యం ఇసాక్
కొత్తచెరువు