ఉన్నటుండి క్షణంలో కళ్ళు పోతే ఎలావుంటుంది ?

25

సిరియాలోని ఆఫ్రైన్ లో అబ్దుల్ మొయిన్ ఎప్పటిలాగే నిద్రలేచాడు కానీ కళ్ళు కనబడట లేదు. అమ్మ , నాన్న నాకు కళ్ళు కనబడట్లేదు. కళ్ళు తెరుచుకోవడం లేదు భయంగా ఉంది అని రోదించాడు. పాపం ఆ పిల్లవాడికి తెలియదు సిరియా బాంబ్ పేలుడు తన రెండు కళ్ళని తీసుకుపోయిందని. ఎప్పటిలాగే అబ్దుల్ మొయిన్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు సడెన్ గా ల్యాండ్ మైన్ పేలింది, పేలిన ఆ ల్యాండ్ మైన్ తన కళ్ళను తీసుకు వెళ్తుందని తనకు తెలియదు. మరునాడు లేచేసరికి తనకు కళ్ళు కనిపించ లేదు, ఆపేరేషన్ చేసినా తనకు కళ్ళు తిరిగి రాలేదు, దీనితో హాస్పిటల్ బెడ్ ఫై తన రోదన మిన్నంటింది. సిరియా ఉగ్రవాదం పిల్లలకు భవిష్యత్ లేకుండా చేస్తుంది.