telugu navyamedia
రాజకీయ వార్తలు

చిదంబరం కేసులో కొత్త మలుపు.. ఈడీ అధికారి బదిలీ

congress chidambaram

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజా బదిలీ అయ్యారు. ఢిల్లీ పోలీస్ విభాగంలోకి ఆయనను అధికారులు బదిలీ చేశారు. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ బదిలీ జరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఈడీ డైరెక్టరేట్ లో రాకేశ్ అహూజా డిప్యుటేషన్ కాలం మూడు వారాల క్రితమే ముగిసిందని ఈడీ అధికారులు తెలిపారు.

ఎఫ్ఐపీపీ అనుమతుల కోసం తాము 2007లో లంచం ఇచ్చినట్లు ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్ధాపకులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా చెబుతున్నారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అధికారులు చిదంబరాన్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి.

Related posts