ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం ఆయన అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన చిదంబరంను వెంటనే జైలు వర్గాలు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
చిదంబరంను ఎయిమ్స్ వైద్యులు వీఐపీ ప్రైవేటు రూమ్ లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రెండు రోజులు బెయిల్‌పై అనుమతించాలని గత వారం కోర్టు విచారణ సందర్భంగా చిదంబరం కోరారు. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరం ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీలో కొనసాగుతారు.