telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ బ్యూటీపై చీటింగ్ కేసు

Meera-Mithun

బిగ్ బాస్ బ్యూటీ మీరా మిథున్ దక్షిణ భారతీయ అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తరువాత “8 తూట్టాగళ్” సినిమాతో హీరోయిన్ గా కూడా పరిచయమైంది. అయితే మీరా మిథున్ ఇటీవల సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి సన్నాహాలు చేసి వివాదాల్లో ఇరుక్కుంది. తాజాగా మీరా మిథున్ పై చీటింగ్ కేసు నమోదలైంది. స్థానిక టీ.నగర్, ప్రకాశం వీధికి చెందిన రజిత్ భద్రాశ్రీ అనే వ్యక్తి నటి మీరామిథున్ పై పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తను పూలదండల వ్యాపారం చేసుకుంటున్నానని, తనకు 2018లో నటి మీరామిథున్ పరిచయమైందని తాను మిస్ దక్షిణాది అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకున్నానని, త్వరలో సొంతంగా అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పి, దానికి డిజైనింగ్ కాంట్రాక్టు తనకు ఇప్పిస్తానని చెప్పి అడ్వాన్స్ గా రూ.50 వేలు తీసుకుందని చెప్పాడు. అయితే ఆమె డిజైనింగ్ కాంట్రాక్టు తనకు ఇవ్వలేదని, తన నుండి తీసుకున్న యాభై వేలు తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటి మీరామిథున్ ని విచారించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె తమిళ బిగ్ బాస్ గేమ్ షో లో ఉండడంతో ఆమెని విచారించడానికి హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts