telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం .. వ్యూహరచనలో బాబు బిజీబిజీ…

tdp chandrababu

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికలకు వ్యూహం రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర బాబు. చిత్తూరు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వచ్చే స్థానిక ఎన్నికలలో పాటించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు.. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం వైకాపా బాధితులతో సమావేశమైన చంద్రబాబు.. అనంతరం పుంగనూరు నియోజకవర్గంపై సమీక్ష చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మరో ఆరు నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చంద్రబాబు చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని తెదేపా అధినేత పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని అన్నారు. వైకాపా నేతల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ….కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు పార్టీ లీగల్ సెల్ నుంచి న్యాయపరమైన సలహాలు అందిస్తామన్నారు. ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా చూడటం, ఆర్థికంగా వెసలుబాటు ఉన్న చోట దోచుకోవటమేన మీ పాలన అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు…వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. వైకాపా బాధితులకు తెలుగు దేశం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. అధికార పార్టీ నుండి ఎన్ని సమస్యలు వచినప్పటికీ… వాటిని సమర్థంగా ఎదుర్కొంటామని, తమ నిజాయుతి ఏంటో నిరూపించుకుంటామని స్పష్టంచేశారు.

Related posts