Chandrababu warns party leaders

పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

19
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో  ఆ పార్టీ  నేతలపై మండిపడ్డారు. కొందరు  పార్టీ నేతలు ఇప్పటివరకు సరిగా  పని చేయకపోయినా మారుతారనే  భావనతో  చర్యలు  తీసుకోలేదని అయన  అన్నారు.  తానేమీ పట్టించుకోవటం లేదనుకొని, ఏదైనా చేయచ్చు  అనే భావనలో కొందరు నేతలున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రోజు ఎవరేం చేస్తున్నారో,  అన్ని నివేదికలు తన  దగ్గర ఉన్నాయని, ఇక పై తానూ తీసుకునే  చర్యలకు నేతలే  భాద్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
ఎన్నికలకు ఏడాది గడువు ఉన్నందున  ఇకపై ఎవరి నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షేశించేది లేదని  తేల్చి చెప్పారు.  ఎన్నికల్లో గెలుపే ముఖ్యం,  పార్ట్ కోసం రాష్ట్రం కోసంకఠినంగా ఉండక తప్పదని,  వింటే  వ్యక్తిగతంగా చెబుతా,  వినని  పక్షంలో ప్రజల్లోనే చెబుతానని  హెచ్చరించారు.  ప్రభుత్వం చేసిన పనులపై విస్తృతంగా ప్రచారంచేయాలని సూచించారు. పూర్తిస్థాయిలో రాజకేయాల్లో కొనసాగాలంటే అన్నింటిపై ఆవగాహన పెంచుకోవాలన్నారు.