telugu navyamedia
ఆంధ్ర వార్తలు

356 ఆర్టికల్‌ను విధించాలని చంద్ర‌బాబు డిమాండ్..

ఏపీలో మంగళగిరిలో గల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై, ఆ పార్టీ నేత‌ల‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడులు చేసిన‌ అంశంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకుపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని 18 మంది సభ్యుల బృందం సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లింది. ఈ మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు చంద్రబాబు.

ఆ సందర్భంగా ఏపీలో వైసీపీ పాలన, టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ పాలసీలపై రాష్ట్రపతికి చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు నాలుగు ప్రధాన అంశాలను ప్రెసిడెంట్‌ ముందు పెట్టారు.. 8 పేజీల విజ్ఞాపన పత్రాన్నిఅందజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం సహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు.

లిక్కర్, డ్రగ్స్, మైనింగ్, సాండ్ మాఫియా విస్తరించిందని..ప్రత్యేక జీవో ద్వారా మీడియాతో సహా అన్ని వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశామ‌ని అన్నారు. అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని, అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీని రీకాల్ చేయాలని, త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రపతిని కోరినట్టు మీడియాకు వివరించారు.

డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని తమ పార్టీ నేతలంటే.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే తొలిసారి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయని, దీనిపై యాక్షన్ తీసుకోవాలని రాష్ట్రపతిని కోరామని చెప్పారు చంద్రబాబు. ఏపీలో మద్యపాన నిషేధం పేరు చెబుతూనే.. అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బాబు ఫైర్ అయ్యారు.

Chandrababu Naidu

ఏజెన్సీ ప్రాంతంలో 25 వేల ఎకరాల్లో 8 వేల కోట్ల రూపాయల గంజాయి సాగు అవుతుందని, ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా.. ఆంధ్రప్రదేశ్ తో దానికి సంబంధం ఉందని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు.. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి డ్రగ్స్ సరఫరా, ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయన్న ఆయన.. మద్యపాన నిషేధం అంటూ, తక్కువ నాణ్యత గల మద్యం అమ్ముతున్నారని.. డ్రగ్స్, గంజాయి అమ్మకాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Related posts