chandrababu planned to question modi in niti aayog

కేంద్రం నిగ్గు తెలుస్తా…చంద్రబాబు…

13

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, విభజన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇన్ని రోజులు బహిరంగ సమావేశాల్లో, మీడియా ముందు వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఒకడుగు ముందుకేసి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రుల ముందల నిలదీస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వ్యవసాయం, విద్య, వైద్య, తదితర రంగాల్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయాన్ని, ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పథకాలు, పథకాల ద్వారా వచ్చిన నిధులు, వాటిలో జరిగిన అన్యాయం తదితర వివరాలన్నింటిని సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆదేశించాడు. అయితే ఈ నెల 16న ఢిల్లీలో జరగనున్న, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం లో అందరి ముందు ప్రశ్నిస్తానన్నారు. అయితే ఈ నెల 16 న రంజాన్ పండగ కూడా ఉండటంతో, ముస్లింలతో విందు కార్యక్రమాల్లో సమావేశాల్లో పలు పంచుకునేందుకు సమావేశపు తేదీని మార్చమని కేంద్రాన్ని కోరినా, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లభించలేదు.

chandrababu planned to question modi in niti aayog

కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం వైదొలిగిన తరువాత మోడీకి ఎదురుపడనున్న తొలి సమావేశం ఇదే, ఇందులో భాగంగా రాష్ట్రం తరపున ఏయే అంశాలు లేవనెత్తాలన్న అంశాలపై, సచివాలయంలో ఉన్నతాధికారులు, శాఖాధిపతులు మరియు కోశాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ అని, కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీకి దాన్ని ఏర్పాటు చేశారని, దానిపై కేంద్రం పెత్తనం తగదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేస్తారని సమాచారం. రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్ స్వతంత్రంగా పంపిణీ చేయాలని, కానీ కేంద్రమే నిబంధనలు విధించడాన్ని తప్పుబట్టారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు సంబంధించి కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో వివరంగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

విభజనలోని అంశాలతో పాటు కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక ఇవ్వాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని చంద్రబాబు కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి, అన్ని వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్ర పథకాల తాజా స్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. 1971సర్వేలో జరిపిన జనాభా లెక్కలను కాకుండా, తాజా సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, జనాభా నియంత్రణను సమర్థంగా అమలుచేసి, బాగా పని చేసిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.