ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పేపర్ పరిశ్రమ ఏర్పాటు ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.ఈ పరిశ్రమ ద్వారా 4500 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరే అవకాశం ఉందన్నారు. పేపర్ పరిశ్రమలో ప్రతి ఏడాది 4.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి కానుంది. దీంతో రామాయపట్నం ఒక మంచి లాజిస్టిక్ పోర్టుగా మారుతుందన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌గా ఉన్నామని ఆయన తెలిపారు. పోర్టు, పేపర్ పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని సీఎం తెలిపారు. ప్రతిపక్ష నేతలు పరిశ్రమలను అడ్డుకోవాలని చూసినా ప్రజలే వాళ్లను తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు. ఏపీ తీర ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు చెప్పారు.