ఆంధ్రప్రదేశ్ లో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు.
యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తా లతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.
లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు.
కంటెంట్, స్కిల్ డెలవప్మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడెమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు.
అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆహ్వానించారు.