telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం: చంద్రబాబు

పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయ్యడం లేదని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఆదివారం రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పోటీకి టీడీపీ దూరమని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా సార్వత్రిక ఎన్నికలపైనే ఉందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని చెప్పారు.కుల రాజకీయాలను అంతా వెలివేయాలన్నారు.

అభివృద్ధి, మంచి కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని సీఎం తెలిపారు. అవినీతి కాంక్షించేవారు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసుకున్నామని, గెలుపు గుర్రాలనే నిలబెడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక కూడా వీటితోపాటే జరుగుతున్నందున.. దానికీ టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ స్థానానికి తనకు మద్దతు ఇవ్వాలని సిట్టింగ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఆయనకు మద్దతు ఇచ్చే విషయం పై టీడీపీ స్పష్టం చేయలేదు.

Related posts