telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఆక్వా రైతులకు అండగా ఉండాలని పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇక్కడ ఏపీలోని ఆక్వారంగం కూడా ప్రభావితమవుతోంది.

దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నేడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు.

భారత్పై అమెరికా 27 శాతం సుంకం విధింపు కారణంగా దేశీయ ఆక్వా రైతులు నష్టపోతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలను తగ్గించాలని, తద్వారా ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

అధిక టారిఫ్ ల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేయడానికి కూడా స్థలం లేదని ఆయన తెలిపారు.

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం ఒక ముఖ్యమైన భాగమని గుర్తు చేస్తూ, ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.

ఆక్వా రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చిన చంద్రబాబు, ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts