telugu navyamedia
ఆంధ్ర వార్తలు

భద్రత విషయంలో అశ్రద్ద వద్దు..-వంగవీటి రాధాకు బాబు ఫోన్..

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ  హత్యకు రెక్కీ వ్యవహారం బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది..ప్రభుత్వం కేటాయించిన 2+2 గన్‌మెన్లను తిరస్కరించిన వంగ‌వీటి రాద ..తాను నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తినని .. అందుకే సెక్యూరిటీ వద్దన్నానని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు గన్ మెన్లను తిరస్కరించడం సరికాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. వ్యక్తిగత భద్రత విషయంలో అశ్రద్ద వద్దని.. రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్నారు చంద్రబాబు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బాబు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు.

దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్‌ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, హింసాత్మక ఘటనలపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు.

మ‌రోవైపు..ఐతే రాధాపై రెక్కీ చేసింది విజయవాడకు చెందిన వైసీపీ కార్పొరేటర్‌ ఆరవ సత్యనారాయణ అంటూ ప్రచారం జరుగుతోంది. . రాధాతో నిన్న రాత్రి పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. రాధా సన్నిహితుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. అనుమానిత ఆధారాల కోసం ముమ్మర విచారణ కొనసాగుతోంది..

Related posts