కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ నిర్మాణం జరిగింది అని రవీంద్ర అన్నారు.
తెలుగు వారి సత్తాను చంద్రబాబు ప్రపంచానికి చాటి చెప్పారు గ్రామ స్థాయి కమిటీల నిర్మాణమే టీడీపీ బలం అన్నారు.
ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని కార్యకర్తలు పార్టీని నిలబెట్టార అన్నారు. మద్యం కుంభకోణం మొత్తాన్ని బయటకు లాగుతాం అని రవీంద్ర అన్నారు.
వైసీపీ వారు ప్రజల సొమ్ము దోచి తిరిగి మా పై నిందలేస్తున్నారు అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.