telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

టిడిపి ప్రతినిధి బృందంపై వైసిపి దాడి గర్హనీయం : చంద్రబాబు నాయుడు

chandrababu tdp ap

* వైసిపి దోపిడి బైటపెట్టారనే అక్కసుతోనే దాడికి తెగించారు
* కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ప్రధాని మోది కొనియాడారు
* బొమ్మల తయారీకి వాడే చెట్లను వైసిపి నరికేస్తోంది.
* అడవులు నరికేస్తున్నారు, కొండలు కొట్టేస్తున్నారు, గుట్టలు తవ్వేస్తున్నారు.
* మట్టి,ఇసుక, కంకర స్వాహా చేస్తున్నారు. పంచభూతాలను మింగేస్తున్నారు.
* కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ గర్హనీయం.
* కాకినాడ, బందరు వద్ద మడ అడవులను వైసిపి నాయకులు నరికేశారు
* స్థానిక ప్రజలే వైసిపి అరాచకాలను బైటపెట్టారు.
* మడ అడవుల పరిరక్షణకు సామాజిక ఉద్యమం ప్రారంభించారు
* టిడిపి నాయకులపై వైసిపి దాడిని ఖండించిన చంద్రబాబు
* అక్రమ మైనింగ్ చేసేవారిని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి
* రాష్ట్రంలో సహజ వనరులను కాపాడాలి… ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన చంద్రబాబు

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టిడిపి ప్రతినిధి బృందంపై వైసిపి దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ దాడిలో టిడిపి జడ్ పిటిసి సభ్యుడు సజ్జా అజయ్ గాయపడిన సంగతి తెలిసిందే. ‘‘టిడిపి ప్రతినిధి బృందంపై వైసిపి దాడి గర్హనీయం. అధికారం అండ చూసుకుని వైసిపి పేట్రేగి పోతోంది. వైసిపి నాయకుల దోపిడికి హద్దు, అదుపు లేకుండా పోయింది. అడవులు నరికేస్తున్నారు, కొండలు కొట్టేస్తున్నారు, గుట్టలు తవ్వేస్తున్నారు. మట్టి,ఇసుక, కంకర స్వాహా చేస్తున్నారు. పంచభూతాలను మింగేస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్రమోది మన ఆటబొమ్మల ఖ్యాతిని ప్రశంసించారు, కొండపల్లి బొమ్మల తయారీ ప్రాశస్త్యాన్ని కొనియాడారు, ప్రాచీన కళా సంస్కృతులను నిలబెట్టాలని మన్ కి బాత్ లో ప్రధాని మోది కోరారు. కానీ వైసిపి నాయకులు బొమ్మల తయారీకి ఉపయోగపడే చెట్లను కూడా వదలడం లేదు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో వందలాది చెట్లను నరికేయడం హేయం.

కాకినాడ, బందరు సమీపంలో మడ అడవులను కూడా వైసిపి నాయకులు నరికేశారు. కోస్తా తీరానికి ఉన్న సహజసిద్ద రక్షణ గోడలు మడ అడవులు. టిడిపి హయాంలో మడ అడవుల పెంపకానికి విశేష కృషి చేశాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక మడ అడవుల విధ్వంసానికి పాల్పడ్డారు. స్థానిక ప్రజలే ముందుకొచ్చి సోషల్ మీడియా కాంపైన్ ద్వారా వైసిపి అరాచకాలను బైటపెట్టారు. మడ అడవుల పరిరక్షణ కోసం సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

మడ అడవుల విధ్వంసం మరుగున పడకుండానే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో విధ్వంస కాండకు వైసిపి తెగించింది. వైసిపి ఎమ్మెల్యే, ఆయన బంధువులే కొండపల్లి అక్రమ మైనింగ్ సూత్రధారులు. వాళ్ల దోపిడి బట్టబయలు చేశారన్న అక్కసుతోనే టిడిపి నాయకుల ప్రతినిధి బృందంపై దాడికి తెగించారు. టిడిపి ప్రతినిధి బృందంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయాలి. విచక్షణారహితంగా చెట్ల నరికివేతకు పాల్పడిన వైసిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో సహజ వనరులను కాపాడాలని’’ చంద్రబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Related posts