మాఫియా శక్తులన్నీ ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో భద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు.విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘనలకు పాలపడుతున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాయడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని లేఖలో పేర్కొన్నారు. మీడియాపై వరుస దాడులు చేస్తున్నారుని అన్నారు. తుని, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు చేశారని అన్నారు.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయితీలో తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై పట్టపగలు దాడి చేశారన్నారు. . ఈ దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసీపీకి చెందినవారు కాబట్టే వాళ్ల పాత్ర బైటకు రానివ్వకుండా పోలీసులే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణం: నక్కా ఆనంద్ బాబు