ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఉల్లిపాయ ధరలపై సభ అట్టుడుకింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ. 200కు అమ్ముతున్నారంటూ సీఎం జగన్ మరోసారి వ్యాఖ్యానించారు. ఉల్లిని తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తోందని… అందుకే రైతు బజార్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం కొత్త కాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగాక్ స్పందించారు.
హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని పలు మార్లు చెప్పినా… అవే మాటలు మాట్లాడటం సరికాదని చంద్రబాబు అన్నారు. దీని గురించి నిన్ననే తాను క్లియర్ గా చెప్పానని అన్నారు. అయినప్పటికీ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ తమదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగన్ కు సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్, సోలార్ విండ్ పవర్ మాదిరి మీలా తాము మోసాలు చేయలేదని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు.
ప్రజావేదికను కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగం: కేశినేని నాని