telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాపైనే కేసులు పెడతారా..తెలంగాణ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. డేటా గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల పై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి తిరిగి మా ప్రభుత్వంపై నే కేసులు పెడతారా? అని మండిపడ్డారు. టీడీపీ సమాచారాన్ని దొంగతనం చేసిన మీరు దాన్ని సమర్థించుకుంటారా అని ప్రశ్నించారు. సంస్థలో 160 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తారా అని తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 20 ఏళ్లుగా కార్యకర్తలకు సంబంధించిన డేటాను సేకరించాం. ఒక్కో కార్యకర్తకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చేశామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడుగడుగునా అడ్డుపడిందనీ, తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని పారదర్శకంగా ప్రజల ముందు పెడుతున్నామన్నారు. అవినీతి తక్కువగా ఉండే మూడవ రాష్ట్రంగా ఏపీ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts