telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

తెలుగు గడ్డపై జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ఆయనకు పలువురు ప్రముఖులు, జాతీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేయగా, చంద్రబాబు స్పందించారు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.

మన రాష్ట్రానికి మన ప్రజలకూన్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయని అన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం భవిష్యత్తు తరాల కోసమని అన్నారు. ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని తెలిపారు.

Related posts