telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మా వాళ్ళు పోటీ చేయడానికి ..భయపడుతున్నారు.. : చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం చేయిస్తున్న సీబీఐ దాడులు, వేధింపులతో తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజే మా పార్టీ నేత ఒకరు నన్ను స్వయంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. పోటీ చేస్తే, సీబీఐ దాడి జరుగుతుందని తన ఇంట్లో భయపడుతున్నారని నాతో చెప్పారు. ఎంతమందికి మానసిక క్షోభ కలిగిస్తున్నారు? ఇది ఎంత దుర్మార్గం? 160 మంది పనిచేస్తున్న ఓ కంపెనీని మూసేయించారు.

మీకు ఒక పత్రిక (సాక్షి) ఉంది కదా? మిమ్మల్నందర్నీ బెదిరిస్తే ఎవరుంటారు? గౌరవంగా ఉద్యోగం చేసుకునేవాళ్లు ఈ తరహా బెదిరింపులు మనకెందుకని ఇంట్లో ఉండి పోతారు. ఆపై పత్రిక మూతపడిపోతుంది. ఇప్పుడదే చేస్తున్నారు. దాడిచేసి డేటాను దొంగతనం చేసి, ఉద్యోగుల్ని తరిమేసి, సంస్థను మూసేశారు. ఇప్పుడు మా సర్వర్‌ డౌన్‌ అయింది. మేం మా కార్యకర్తలతో మాట్లాడడాన్ని అడ్డుకోవాలనే ఇంత కుట్ర. ఎన్నికల ముందు చాలా దుర్మార్గం” అని ఆయన అన్నారు.

Related posts