telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ప్రతిపక్షాలు ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. ఎన్నికల షెడ్యూల్ కు ఈసీ 73 రోజులు తీసుకుందనీ, వీవీప్యాట్ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకుంటే నష్టం ఏంటని ట్విట్టర్ లో ప్రశ్నించారు.మోదీ రాజకీయ లాభం కోసం రక్షణశాఖను, సైన్యాన్ని కూడా వాడుకుంటారని చంద్రబాబు విమర్శించారు.

మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23 తర్వాత ప్రధాని మోదీని దేశ ప్రజలు తిరస్కరించడం ఖాయమని తెలిపారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదనీ, ఎన్నికల సంఘం అధికారుల పక్షపాత ధోరణిపైనేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై చర్యలు తీసుకునే విషయంలో ఈసీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగానే తాము పోరాడుతున్నామని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

Related posts