telugu navyamedia
రాజకీయ వార్తలు

జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు

chandrababu

చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఐతేపల్లిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని అన్నారు. మలేరియా, డెంగీ, అంటువ్యాధులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

ఇసుకను ఉచితంగా ఇస్తే కార్మికుల ఆత్మహత్యలు ఆగుతాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ, అంటువ్యాధులు ఎందుకు విస్తరిస్తున్నాయని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని, అదే అతని నీతీ నిజాయతీ అని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

Related posts