సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశమైన చంద్రబాబు జిల్లాలో అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో కేఈ, కోట్ల కుటుంబాలు ఒక ఒప్పందానికి రావడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అలాగే ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని తెలిపారు. డోన్ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్, పత్తికొండ అసెంబ్లీ నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబులను ఎంపిక చేశారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మంత్రాలయం నియోజకవర్గం నుంచి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి తిరిగి పోటీ చెయ్యనున్నట్లు తెలిపారు. బనగానపల్లె నుంచి బీసీ జనార్థన్ రెడ్డిని ప్రకటించారు. కర్నూలు, ఆదోని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. ఈ నియోజకవర్గాల అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ