telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యండమూరి వీరేంద్రనాథ్ ప్రారంభించిన “చదువరి.కామ్” వెబ్ సైట్

చదువరి.కామ్ వెబ్ సైట్ పరిచయ కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగినది. ప్రఖ్యాత చేతివ్రాత నిపుణులు మల్లికార్జున్, తెలుగు భాషాభిమాని VVR కిషన్ ….ఈ తెలుగు వెబ్ సైట్ సంకల్పించారు.  తెలుగు చదువు డిజిటల్ గా రావలసిన అవసరాన్ని గుర్తించి తెలుగు పుస్తకాల ఆన్ లైన్ అమ్మకం మరియు డిజిటల్ పుస్తకాల సంకలనం ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని నిర్వాహకులు తెలియచేసారు. 
ముఖ్యంగా తెలుగు కథలు, కవితల తో పాటుగా … తెలుగు భాషాభిమానం ఉన్న రచయితల కాలమ్, రచయితల పరిచయం, ఇలాటి వినూత్న రచనలని ప్రతీ వారం కొత్తవి చేరుస్తూ ఈ వెబ్ సైట్ ని ముందుకు తీసుకు వెళ్లాలనే ఉద్దేశాన్ని నిర్వాహకులు తెలియ చేసారు.

Chaduvari1
ముఖ్యంగా, ప్రఖ్యాత రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ సైట్ లో తోలి తెలుగు ఆన్ లైన్ సీరియల్ ప్రారంభించి ప్రోత్సహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వార పత్రికల పరిస్థితి వెబ్ పత్రికల ప్రారంభ ఆవశ్యకత, వాటి సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాల గురించి వివరించారు. ఈ సీరియల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితులకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు, ఉపాధి కోల్పోయిన అల్పాదాయ వర్గాలకు విరాళంగా ఇస్తున్నారు. తెలుగు డిజిటల్ గా మరింతగా లభ్యం కావలసిన అవసరం ఉందని, చదువరి.కామ్ ద్వారా దానికి చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని తెలుగు ప్రజలందరూ ఆదరిస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

Related posts