telugu navyamedia
సామాజిక

చదివితే ఇవి పదాలు మాత్రమే,  ఆచరిస్తే…  అస్త్రాలు

కుదిరితే పరిగెత్తు.. ,

లేకపోతే నడువు…

అదీ చేతకాకపోతే…

పాకుతూ పో…. ,

అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు…

ఉద్యోగం రాలేదని,

వ్యాపారం దెబ్బతినిందని,

స్నేహితుడొకడు మోసం చేశాడని,

ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని…

అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,

దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…

తలుచుకుంటే…

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా…

నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,

అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…,

పారే నది..,

వీచే గాలి…,

ఊగే చెట్టు…,

ఉదయించే సూర్యుడు….

అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా….,,

ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే…

బయలుదేరు…

నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో… ,

పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు…

నువ్వు పడుకునే పరుపు…

నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్… ,

నీ అద్దం….

నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో… ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా…

కన్నీళ్ళు కారిస్తే కాదు…,

చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

Related posts