chaddi-gang-again-in-hyderabad

హైద్రాబాద్ లో చడ్డీ గ్యాంగ్ హల్చల్…

67

హైదరాబాద్ లో మళ్ళీ ఒకసారి చడ్డీ గ్యాంగ్ హల్చల్ చేయటం ప్రారంభించింది. బండారి లేఔట్ లోని శ్రీరామ అపార్టుమెంటు లో చోరీకి పాల్పడింది ఈ గ్యాంగ్. వీరు చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదు కావటంతో వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు స్థానికులను ఈ గ్యాంగ్ పై హెచ్చరించారు. ఈ గ్యాంగ్ నిన్న రాత్రి 2-50 నిమిషాలకు చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది.

ఈ చోరీ జరిగిన ప్రాంతం బాచేపల్లి పోలీస్ స్టెషన్ పరిదిలో ఉంది. నిందుతుల కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు రాచకొండ, సైబరాబాద్, మెదక్, హైదరాబాద్ పరిధి ప్రాంతాలలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఈ చడ్డి గ్యాంగ్ పట్ల ప్రజలు హైదరాబాద్ పరిధిలో భయాందోళనలు చెందుతున్నారు. గతంలో ఈ చడ్డీ గ్యాంగ్ మియాపూర్ లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.